కరోనా ఎఫెక్ట్ : పేద కుటుంబాలకు రూ 5000 నగదు సాయం

చండీఘడ్ : కరోనా మహమ్మారితో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడే దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు రూ 5000 నగదు సాయం అందిస్తామని హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించిన క్రమంలో జీవనోపాధి కోల్పోయిన బీపీఎల్ కుటుంబాలకు నగదు సాయం అందించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ మరికొంత కాలం కొనసాగుతుందని చెప్పారు. మే 10 నుంచి మే 17 వరకూ సురక్షిత్ హర్యానా పేరిట కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. లాక్డౌన్ కు తోడు కఠిన నియంత్రణలను అమలు చేస్తామని చెప్పారు. అంత్యక్రియలు, వివాహ వేడుకల్లోనూ 11 మందికి మించి గుమికూడేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో హర్యానాలో 13,548 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 151 మంది మహమ్మారి బారినపడి మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

