జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగింపు, ఎక్కడంటే..
లాక్డౌన్| కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

ఛండీగఢ్: కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడుస్తాయని తెలిపారు. అయితే విద్యా సంస్థలు మాత్రం జూన్ 15 వరకు తెరిచేదిలేదని వెల్లడించారు. కాగా, రాత్రి కర్ఫ్యూ 10 గంటల నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటిసారి మే 3న వారం రోజులపాటు లాక్డౌన్ విధించారు. అది మే 10న ముగియడంతో 18వ తేదీవరకు పొడిగించారు. అనంతరం దానిని ఈ నెల 31 వరకు మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా మళ్లీ పొడిగించింది.
హర్యానాలో ఇప్పటివరకు 7,53,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23,094 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 7,22,711 మంది బాధితులు కోలుకున్నారు. మరో 8,132 మంది కరోనా వల్ల మరణించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1868 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

