చండీగఢ్, మే 10: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. అయితే 10వ తరగతి ఇంగ్లిష్ పేపర్లో పాస్ కాలేదని అదే ఏడాది ఆగస్టులో ఆయన ఫలితాలు నిలిపేశారు.
ఆ తర్వాత 10వ తరగతి పరీక్ష రాశారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఇంగ్లిష్ పరీక్షలో పాసయ్యారు. 100కు 88 మార్కులు సాధించారు. దీంతో ఆయన 12వ తరగతి కూడా పాసైనట్టు అధికారులు వెల్లడించారు.