బమాకో, మే 5: పశ్చిమ ఆఫ్రికా దేశం మాలికి చెందిన హలీమా సిసే (25) అనే మహిళ మంగళవారం 9మందికి జన్మనిచ్చింది. ఇందులో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు. సిజేరియన్ ద్వారా ఆమెకు ప్రసవం జరిగింది. మాలిలో అధునాతన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో.. హలీమాకు మొరాకోలోని దవాఖానలో ప్రసవం జరిగింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు.