Gangster Nomination : సొంత మనవడి హత్య కేసు (Murder case) లో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్స్టర్ (Gangster) పుణె లోకల్ బాడీ ఎన్నికల (Civic Polls) లో పోటీ పడుతున్నాడు. శనివారం అతడు జైలు నుంచి రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ (Nomination) దాఖలు చేశాడు. ముఖానికి నల్లటి ముసుగు కట్టి, చేతులను తాళ్లతో కట్టేసి పోలీసులు అతడిని రిటర్నింగ్ ఆఫీస్కు తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సొంత మనవడు ఆయుష్ కోమ్కర్ హత్య కేసులో గ్యాంగ్ లీడర్ బందు అందేఖర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడికి ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. దాంతో అతడు ఇండిపెండెంట్గా బరిలో దిగాడు. నామినేషన్ వేసేందుకు వస్తూ నినాదాలు చేశాడు. ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న అందేఖర్ కుటుంబంలోని మరో ఇద్దరు మహిళలు కూడా ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కోర్టు అనుమతి ఆ ఇద్దరు మహిళలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయుష్ కోమ్కర్ సెప్టెంబర్ 5న నానాపేటలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అందేఖర్ ఆయన కుటుంబంలోని ఇద్దరు మహిళలతోపాటు మరో 15 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పుణెతో సహా మరో 28 ప్రాంతాల్లో జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.