తిరువనంతపురం: కేరళలోని గురువాయుర్ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ గుడికి చెందిన కొలనులో ఈ కార్యక్రమం ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్, బిగ్‌బాస్ కాంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్(Jasmine Jaffar) చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదాస్పదం కావడంతో గుడిలో శుద్ధి చేసేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆరు రోజుల పాటు వివిధ రకాల శుద్ధి పూజలు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. 18 రకాల పూజలు, 18 రకాల శ్రీవేలీలు ఉంటాయన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభంకానున్నది. గురువాయుర్‌లో దర్శనాలను రేప మధ్యాహ్నం వరకు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
జాస్మిన్ జాఫర్ వీడియో నేపథ్యంలో గురువాయుర్ దేవస్థానం బోర్డు పోలీసు ఫిర్యాదు చేసింది. నిషేధిత ప్రదేశంలో వీడియోను రికార్డు చేసినట్లు ఆరోపించారు. గుడి కొలను, నడప్పురలో వీడియో తీసిందామె. ఇది హైకోర్టు ఉల్లంఘన అని ఆలయ కమిటీ చెప్పింది. పవిత్రమైన కోనేరులో జాస్మిన్ తన పాదాలను కడుగుతున్నట్లు వీడియోలో చూపించింది. అయితే ఆ కొలనులో ఉత్సవ మూర్తికి స్నానం నిర్వహించేందుకు ఆరట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అలాంటి నీటిలో జాస్మిన్ పాదాలు కడగడం అపచారంగా భావిస్తున్నారు.
వివాదం తీవ్రం కావడంతో జాస్మిన్ తన రీల్స్‌ను డిలీట్ చేసింది. క్షమాపణలు చెప్పింది.
Social media influencer & #BiggBossMalayalam contestant #JasminJaffar has been embroiled in controversy after she shared a video of herself washing her feet at the sacred #RudiraPond at the #GuruvayurShriKrishnaTemple in #Kerala, while also filming a reel. pic.twitter.com/ZosXgCH4hD
— Hate Detector 🔍 (@HateDetectors) August 26, 2025