Watch: ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు… ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంతో ఢిల్లీకి
న్యూఢిల్లీ: 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలను దేశం ఘనంగా జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన ఖరీదైన కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. ‘హర్ ఘర్ తిరంగా’పై ప్రచారం చేస్తూ కుటుంబంతో కలిసి ఢిల్లీకి ప్రయాణించాడు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవాలనుకుంటున్నాడు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సిద్ధార్థ దోషి తన దేశ భక్తిని విభిన్నంగా చాటాడు. ఖరీదైన జాగ్వార్ కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. కారు బోనెట్తోపాటు డోర్లపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార లోగోలను పెయింట్ చేయించాడు. దీని కోసం రెండు లక్షలు ఖర్చు చేశాడు.

కాగా, త్రివర్ణ పతాక రంగులతో అందంగా ముస్తాబైన కారును చూసి సిద్ధార్థ మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి సూరత్ నుంచి ఢిల్లీకి ఇందులో ప్రయాణించాడు. 1,300 కిలోమీటర్ల దూరంలోని దేశ రాజధానిని రెండు రోజుల్లో చేరుకున్నాడు. ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద తన కారులో రౌండ్లు కొట్టి చూపరులను ఆకట్టుకున్నాడు.
‘హర్ ఘర్ తిరంగా’పై ప్రచారం కోసం తన కారుకు జాతీయ జెండా రంగులు వేయించడంతోపాటు సూరత్ నుంచి ఢిల్లీకి అందులో ప్రయాణించినట్లు సిద్ధార్థ తెలిపాడు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవాలని ఉందని మీడియాతో అన్నాడు. దీని కోసం వారి అపాయింట్మెంట్ను కోరినట్లు వెల్లడించాడు. కాగా, త్రివర్ణ పతాకం రంగుల్లో ఉన్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi: A youth from Gujarat spent Rs 2 lakhs to revamp his car on the theme of #HarGharTiranga
“To make people aware of the campaign, I drove from Surat (Gujarat) to Delhi in my car in 2 days… we want to meet PM Modi & HM Amit Shah," said Sidharth Doshi pic.twitter.com/yC34603HaY
— ANI (@ANI) August 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

