ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక
క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా మారి, సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచి, బీజేపీ పంచన చేరిన యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం నుంచి గొప్ప బహుమతి లభించింది. తన ఇంటిని ఆనుకుని, 2012 నుంచి దానికోసం న్యాయ, పరిపాలనాపరమైన పోరాటం చేస్తున్న పఠాన్‌కు ఆ భూమిలోని సగాన్ని ప్రభుత్వం బహుమతిగా అందజేసింది. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్లాట్ పఠాన్ కుటుంబం నివసిస్తున్న వడోదరలో అతని ఇంటిని ఆనుకునే ఉంది.
- ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా మారి, సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచి, బీజేపీ పంచన చేరిన యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం నుంచి గొప్ప బహుమతి లభించింది. తన ఇంటిని ఆనుకుని, 2012 నుంచి దానికోసం న్యాయ, పరిపాలనాపరమైన పోరాటం చేస్తున్న పఠాన్‌కు ఆ భూమిలోని సగాన్ని ప్రభుత్వం బహుమతిగా అందజేసింది. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్లాట్ పఠాన్ కుటుంబం నివసిస్తున్న వడోదరలో అతని ఇంటిని ఆనుకునే ఉంది. క్రికెటర్‌గా ఉన్నప్పుడు సెక్యూరిటీ కారణాలు చూపుతూ ఆ ప్లాట్ స్వాధీనానికి ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. బెర్హంపూర్ ఎంపీ పఠాన్ తమ పార్టీలో చేరినందుకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం భావించిందో, మరే కారణమో కానీ, ఆ స్థలంలో సగాన్ని గుజరాత్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. మిగిలిన సగాన్ని మార్కెట్ విలువలో 55 శాతానికి కేటాయించేలా నిర్ణయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

