GST collections | జూన్‌లో జోరుగా జీఎస్టీ వసూళ్లు.. రూ.1.94 లక్షలు దాటిన ఆదాయం
GST collections | దేశంలో వస్తుసేవల పన్ను (Goods and Service Tax) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం (GST Income) రూ.1.94 లక్షల కోట్లు దాటింది. నేడు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 13.9 శాతం పెరిగాయి. ముఖ్యంగా దిగుమతులపై వచ్చే పన్ను రాబడి గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.
GST collections : దేశంలో వస్తుసేవల పన్ను (Goods and Service Tax) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం (GST Income) రూ.1.94 లక్షల కోట్లు దాటింది. నేడు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లు 13.9 శాతం పెరిగాయి. ముఖ్యంగా దిగుమతులపై వచ్చే పన్ను రాబడి గణనీయంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. 2026 జూన్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,94,812 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం జూన్‌లో ఈ మొత్తం రూ.1,71,105 కోట్లుగా ఉంది. ఈ పెరుగుదలలో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వాటానే అధికం. దిగుమతులపై పన్ను రాబడి ఏకంగా 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరుకుంది. అయితే దేశీయ లావాదేవీల ద్వారా సమకూరిన జీఎస్టీ ఆదాయం మాత్రం 6.5 శాతం వృద్ధితో రూ.1,34,774 కోట్లుగా నమోదైంది.
దేశీయ వసూళ్ల వృద్ధిరేటు కంటే దిగుమతులపై వసూళ్ల వృద్ధిరేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. రిఫండ్ల తర్వాత ప్రభుత్వానికి అందిన నికర జీఎస్టీ ఆదాయం జూన్‌లో 11.2 శాతం వృద్ధితో రూ.1,62,377 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో నికర వసూళ్లు రూ.1,45,984 కోట్లుగా ఉన్నాయి. ఈసారి మొత్తం రిఫండ్లు కూడా దాదాపు 30 శాతం పెరిగి రూ.32,436 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో దేశీయ రిఫండ్లు 42.9 శాతం పెరిగి రూ.17,767 కోట్లకు చేరాయి.
ఎగుమతులపై ‘ఐస్గేట్’ (ICEGATE) ద్వారా ఇచ్చిన రిఫండ్లు 15.6 శాతం పెరిగి రూ.14,669 కోట్లుగా ఉన్నాయి. ఇక నికర ఆదాయాన్ని విశ్లేషిస్తే.. దేశీయ లావాదేవీలపై వచ్చిన నికర జీఎస్టీ రాబడి కేవలం 2.6 శాతం మాత్రమే పెరిగి రూ.1,17,007 కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వచ్చిన నికర కస్టమ్స్ జీఎస్టీ ఆదాయం ఏకంగా 42.2 శాతం పెరిగి రూ.45,370 కోట్లకు చేరింది. ఇది దిగుమతులపై ఆధారపడి పన్ను వసూళ్లు ఎంతగా పెరిగాయో స్పష్టంచేస్తోంది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) గణాంకాలను పరిశీలిస్తే.. స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం వృద్ధితో రూ.6,31,699 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ వసూళ్లు రూ.5,82,542 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో నికర జీఎస్టీ రాబడి 7.1 శాతం పెరిగి రూ.5,40,218 కోట్లుగా నమోదైంది. మే నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లుగా నమోదవగా, జూన్‌లోనూ అదే స్థాయి వసూళ్లు కొనసాగడం ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు సూచికగా నిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

