చండీఘడ్: అమృత్‌సర్‌లోని ఓ గుడిపై గ్రేనేడ్ దాడి(Grenade Attack) జరిగింది. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరినట్లు తెలిసింది. అర్థరాత్రి గ్రేనేడ్ దాడి జరిగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పేలుడు వల్ల ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. ఎవరికీ గాయాలు కాలేదు. పూజారి, అతని కుటుంబం.. ఆ గుడి పైభాగాన ఉంటున్నారు. వాళ్లకు ఎటువంటి హాని జరగలేదు.
సీనియర్ పోలీసు అధికారుల ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. నగరంలో తొలిసారి మతపరమైన ప్రదేశంపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎక్కువ సార్లు అక్కడ పోలీసు స్టేషన్లపై దాడులు జరిగేవి. గడిచిన నాలుగు నెలల్లో గ్రేనేడ్ దాడి ఘటన చోటుచేసుకోవడం ఇది 12వసారి. దాడిని స్థానిక నేత కిరణ్‌ప్రీత్ సింగ్ ఖండించారు. పంజాబ్‌లో ఉన్న శాంతికి విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందన్నారు.
తెల్లవారుజామున రెండు గంటలకు గుడి పూజారి తమకు అటాక్ గురించిన చెప్పినట్లు అమృత్సర్ పోలీసు కమీషన్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)తో దాడికి లింక్ ఉండి ఉంటుందని భుల్లార్ అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ స్థానిక యువతను వల వేస్తుందన్నారు. యువత తమ జీవతాలను నాశనం చేసుకోవద్దు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకోనున్నట్లు వెల్లడించారు.