Union Government | కంది, మినపపప్పుల నిలువలపై పరిమితులు విధించిన కేంద్రం
Union Government | దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పరిమితులు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటాయని కేంద్రం తన ప్రకటనలో స్పష్టంచేసింది. హోల్ సేలర్స్, రిటెయిలర్స్, బిగ్ చైన్ రిటెయిలర్స్, మిల్లర్లు, దిగుమతిదారులు అందరికీ ఈ పరిమతులు వర్తిస్తాయని పేర్కొంది. హోల్‌సేలర్స్ 200 మిలియన్ టన్నులకు మించి కంది, మినప పప్పు స్టాక్ ఉంచుకోకూడదని కేంద్రం తన ప్రకటనలో ఆదేశించింది.
ఇక రిటెయిలర్లు 5 మిలియన్ టన్నులకు మించి, బిగ్ చెయిన్ రిటెయిలర్లు ప్రతి రిటెయిలర్ దగ్గర 5 మిలియన్ టన్నులకు మించి కంది, మినపపప్పు నిలువలు ఉంచుకోకూడదని కేంద్రం ఆదేశాల్లో పేర్కొన్నది. ఇక మిల్లర్లు గత మూడు నెలల్లో వచ్చిన స్టాక్ లేదా ఆ మిల్లు వార్షిక కెపాసిటీలో 25 శాతం రెండింట్లో ఏది ఎక్కువైతే అంతకుమించి కంది, మినపపప్పులను నిలువ ఉంచుకోవద్దని ఆదేశించింది. అదేవిధంగా దిగుమతిదారులు కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చిన తేదీ నుంచి 30 రోజులకు మించిన స్టాక్‌ను నిలువ ఉంచుకోవద్దని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

