లక్నో: ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మేక వెంటపడ్డాడు. దాని నోటిలో ఉన్న ఫైల్ కాగితాల కోసం విశ్వ ప్రయత్నం చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక బ్లాక్ కార్యాలయంలోకి ఒక మేక ప్రవేశించింది. టేబుల్‌పై ఉన్న ఒక ఫైల్లోని పత్రాలను నోట కరుచుకుని తినసాగింది. చాలా సేపటి వరకు ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు.
కొంత సేపటి తర్వాత గమనించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఫైల్లోని కాగితాల కోసం ఆ మేక వెంట పడ్డాడు. అయితే అది అందకుండా పరిగెత్తి అతడ్ని పరుగులు పెట్టించింది. చివరకు ఆ ఉద్యోగి మేక నోటిలోని కాగితాలను తిరిగి పొందాడు. అయితే అప్పటికే అది సగం మేర తినేసింది.
ఒక వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు.