జైపూర్: ఎక్కడైనా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. కానీ, రాజస్థాన్‌లో సీఎం గెహ్లాట్ మాత్రం నిండు అసెంబ్లీలో గడిచిన సంవత్సర బడ్జెట్ చదివారు. ఇది రాజస్థాన్ అసెంబ్లీలో నిరసనలకు కారణమైంది. శుక్రవారం ఉదయం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే క్రమంలో గత బడ్జెట్‌కు సంబంధించిన సారాంశాన్ని చదవడం ప్రారంభించారు. 8 నిమిషాలపాటు ఆయన ప్రసంగం కొనసాగిన తర్వాత మంత్రులు ఆయనను అప్రమత్తం చేయడంతో ఆగిపోయారు. సీఎం తీరుకు నిరసనగా విపక్ష ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. చివరకు సీఎంసభకు క్షమాపణ చెప్పారు.