కాల్స్‌తో వేధించే వాళ్ల ఆటకట్టు.. భారీగా జరిమానాలు విధించనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: మనమేదో సీరియస్‌గా పని చేసుకుంటూ ఉంటాం. ఏదో తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరిదో అని మనం ఆ ఫోన్ ఎత్తకపోయినా.. పదే పదే చేస్తుంటారు. తీరా అంత అర్జెంట్ ఏంటా అని ఫోన్ ఎత్తితే అవతలి నుంచి ఎవరో టెలిమార్కెటర్.. అది కావాలా, ఇది కావాలా.. గిఫ్ట్‌లిస్తాం, డిస్కౌంట్లిస్తామంటూ చెబుతారు. ఇది విని మనకు చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి కాల్స్ వద్దనుకొని డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) యాక్టివేట్ చేసుకున్నా కూడా వదలకుండా ఏదో ఒక రకంగా ఇలాంటి వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. ఇలా పదే పదే కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో ఇబ్బందిపెట్టే కాలర్స్ చెక్ పెట్టడానికి టెలికాం శాఖ కఠిన చర్యలు తీసుకోబోతోంది.
పది వేల జరిమానా
ఇప్పటి వరకూ ఉన్న ఉల్లంఘనలు, జరిమానాల నిబంధనలను టెలికాం శాఖ కఠినతరం చేయనుంది. 50కిపైగా ఉల్లంఘనలకు పాల్పడే టెలీమార్కెటర్లకు ఆ తర్వాత చేసే ఒక్కో కాల్‌కు ఏకంగా రూ.10 వేల జరిమానా విధించాలని టెలికాం శాఖ ప్రతిపాదించింది. 0-10 ఉల్లంఘనల మధ్య ఒక్కో ఉల్లంఘనకు రూ.1000, 10-50 మధ్య ఒక్కో ఉల్లంఘనకు రూ.5 వేలు, 50కి మించితే ఒక్కో ఉల్లంఘనకు రూ.10 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఉన్న టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (టీసీసీసీపీఆర్), 2018 ప్రకారం ఈ ఉల్లంఘనల రేటు 0-100, 100-1000, 1000కి మించి అని ఉంది. ఇప్పుడు దీనిని భారీగా తగ్గించేసి జరిమానాలను పెంచింది. అంతేకాకుండా టెలికాం శాఖ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) డివైజ్ స్థాయిలో కూడా ఉల్లంఘనలను చెక్ చేస్తుంది.
వెరిఫికేషన్ కాకపోతే ఇక అంతే..
ఈ డివైజ్‌లకు సిస్టమ్ జనరేట్ చేసిన మెసేజ్‌లను వెరిఫికేషన్ కోసం డీఐయూ పంపిస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్ కాకపోతే ఆ నంబర్, దానికి అనుబంధంగా ఉన్న ఐఎంఈఐలను అనుమానాస్పద జాబితాలో ఉంచుతారు. ఇలాంటి వాటికి 30 రోజుల వరకూ కాల్స్, ఎస్సెమ్మెస్ లేదా డేటా వినియోగించే అవకాశం ఉండదు. ఈ అనుమానాస్పద ఐఎంఈఐలో కొత్త సిమ్ వేసుకొని కాల్స్ చేస్తే.. రీవెరిఫికేషన్ అడుగుతారు. ఒకవేళ సదరు కాలర్ తన డివైజ్ మారిస్తే.. కొత్త ఐఎంఈఐ నంబర్‌ను కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అనుమానాస్పద లిస్ట్‌లో పెడతారు.
ఒకవేళ రీవెరిఫికేషన్ తర్వాత సదరు కాలర్ నంబర్ యాక్టివేటై.. మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే.. కొత్త కనెక్షన్ వినియోగంపై పరిమితి విధిస్తారు. ఆరు నెలల వరకూ రోజుకు 20 కాల్స్, 20 ఎస్సెమ్మెస్ మాత్రమే అనుమతిస్తారు. ఇలాగే ఉల్లంఘనలను కొనసాగితే సదరు నంబర్ కోసం ఉపయోగించిన గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్‌ను రెండేళ్ల వరకూ బ్లాక్ లిస్ట్‌లో పెడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

