ఇండియాలో తొలి కరోనా వ్యాక్సిన్ మరణం.. ధృవీకరించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్.. ఇండియాలో వ్యాక్సిన్ తర్వాత తొలి మరణాన్ని ధృవీకరించింది. ఓ 68 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనఫిలాక్సిస్‌తో చనిపోయినట్లు తేల్చింది. వ్యాక్సిన్ తర్వాత కలిగే తీవ్ర దుష్ప్రభావాలకు సంబంధించి నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను ఇండియా టుడే బయటపెడ్డింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ప్రభావాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం అనఫిలాక్సిస్ వల్ల చనిపోయినట్లు తేల్చింది.
ఆ వ్యక్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని కమిటీ రిపోర్ట్ చెప్పింది. వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనఫిలాక్సిస్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తిగా కమిటీ తేల్చింది. అనఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన ఎలర్జీ. నిజానికి మరో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వల్లే చనిపోయినా.. ప్రభుత్వం మాత్రం ఇదొక్క మరణాన్నే ధృవీకరించింది. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్షన్లు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ చెప్పింది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా వ్యాక్సిన్ తర్వాత అనఫిలాక్సిస్ బారిన పడినా.. వాళ్లు చికిత్స తర్వాత కోలుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

