న్యూఢిల్లీ: గంగా నది నీటిని కోవిడ్ చికిత్స కోసం వాడాలన్న అంశంపై పరిశోధన చేపట్టాలన్న అభ్యర్థనలు తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టం చేసింది. నమామి గంగా ప్రాజెక్టుకు చెందిన కొన్ని అంశాలను ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. గంగా నది, వాటి ఉప నదులకు చెందిన నీటి నాణ్యతపై పరిశోధన చేపట్టాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ) నుంచి తమకు ఎటువంటి రిక్వెస్ట్ రాలేదని ప్రభుత్వం తెలిపింది. కానీ గంగా నదిలో లభించే రాళ్ల అవశేషాలతో కోవిడ్19కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అని, ఇక గంగా జలంతో కోవిడ్ చికిత్స చేయవచ్చు అని, అయితే ఈ రెండు అంశాలపై స్టడీ చేపట్టాలని ఐసీఎంఆర్‌కు 2020, మార్చి 28న ఎన్ఎంసీజీ ప్రతిపాదనలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జలశక్తి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ అంశాన్ని లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
The government clarifies that it has not received any request from National Mission for Clean Ganga to conduct research on the use of Ganga river water as a cure for the Covid-19 virushttps://t.co/klWvwiUTeC #ParliamentQuestion @MoJSDoWRRDGR
— PIB India (@PIB_India) December 22, 2022