Goods Train | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఆరుగురికి గాయాలు
Goods Train | ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున బన్సీ పహర్‌పూర్ – రుబ్బాస్ ప్రాంతంలోని రైలు గేటు వద్ద ట్రాలీ ఉన్న ట్రాక్టర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అటుగా వచ్చిన గూడ్స్ రైలు దానిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రైలు ఇంజిన్ వెనుక ఉన్న గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పింది.
కాగా, ఈ ప్రమాదం వల్ల ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారికి ప్రాణ ముప్పు లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటనా స్థలానికి చేరినట్లు పేర్కొన్నారు. అలాగే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌ను రైల్వే సిబ్బంది సరిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

