హూస్టన్, ఏప్రిల్ 22: రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ (హెడీఎల్) ఎక్కువ ఉంటే మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధి దరిచేరదని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యూఎస్సీ) అధ్యయనంలో తేలింది.
అల్జీమర్స్ వ్యాధికి ప్రస్తుతం ఎలాంటి మందు లేదు. 140 మంది రోగులపై పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని తేల్చినట్టు కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకుడు హుస్సేన్ యాసిన్ తెలిపారు.