Yashtika Acharya | జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన యష్తిక ఆచార్య (17) మంగళవారం జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా 270 కేజీల బరువైన రాడ్ ఆమె మెడపై పడింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే దవాఖానకు తరలించారు. కానీ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని వారికి బుధవారం అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ట్రైనర్ కూడా స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు.