పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులకు తెరలేచింది. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) కాంగ్రెస్ పార్టీతో ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. గోవా 60వ విమోచన దినోత్సవం సందర్భంగా జీఎఫ్పీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ ఈ మేరకు శనివారం ప్రకటించారు. ‘ఎన్నికైన నిరంకుశ పాలన (బీజేపీ) నుంచి గోవాను తిరిగి విముక్తి చేసే కూటమిని మీకు అందజేస్తామని మేము గతంలో చెప్పాం’ అని ఆయన అన్నారు.
కాగా, గోవా ఫార్వర్డ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తమ పొత్తును ముందే ఖరారు చేశాయి. గోవా 60వ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం రెండు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించాయి. ‘గోవా కోసం కలిసి పనిచేస్తాం, కలిసి బీజేపీని ఓడిస్తాం’ అంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ శనివారం ఒక ట్వీట్ చేసింది. ఆ పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలు చేతులు కలిపిన ఫొటోను ఇందులో షేర్ చేసింది.
TOGETHER FOR GOA @INCGoa @Goaforwardparty@RahulGandhi @VijaiSardesai @girishgoa @dineshgrao @PChidambaram_IN @INCIndia
— Goa Forward (@Goaforwardparty) December 18, 2021
#CHALYAFUDDEM pic.twitter.com/KdqSs22NYV