Ghulam Nabi Azad | కాంగ్రెస్ అగ్రనాయత్వంపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్వం పనితీరు పేలవంగా ఉందని విమర్శించారు.
ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్వం పనితీరు పేలవంగా ఉందని విమర్శించారు. పార్టీలో ప్రజాస్వామ్య ప్రక్రియకు తావులేదని, అపాయింట్మెంట్ కల్చర్ పెరిగిందని ఆరోపించారు.
ఇందిరా గాంధీ వ్యవహార శైలి మెరుగ్గా ఉండేదని, యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా తాను ఆమెను ఎంతో దగ్గర నుంచి గమనించే అవకాశం లభించిందని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీని అప్పట్లో మీరు ఏ సమయంలోనైనా కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వాన్ని సంప్రదించే పరిస్ధితి లేదని వాపోయారు. తాను బీజేపీ బీ టీంగా వ్యవహరిస్తున్నానని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఆజాద్ తోసిపుచ్చారు. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ చేస్తున్నదేమీ లేదని బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ దోహదపడిందని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో తన సంబంధాలపై బదలిస్తూ పలు వివరాలు వెల్లడించారు. రాహుల్ చేసిన పలు పొరపాట్లకు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ నేత హిమంత బిశ్వ శర్మ పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉండగా ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని చెప్పారు. శర్మ తిరుగుబాటు వ్యవహారాన్ని తాను రాహుల్‌కు వివరించగా ఆయనను బయటకు వెళ్లనివ్వండని నిర్లక్ష్యంగా అన్నారని ఆజాద్ గుర్తుచేసుకున్నారు. ఆపై కాంగ్రెస్ ముఖ్య వ్యూహకర్త, ట్రబుల్ షూటర్ శర్మ పార్టీని వీడి బీజేపీలో చేరి అసోం సీఎం అయ్యారు.
Read More
వృద్ధురాలి సాహసం.. గుండె ఆపరేషన్ అయినా లెక్క చేయలేదు.. పరుగున వెళ్లి రైలు ప్రమాదాన్ని తప్పించి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

