ఇంఫాల్: భారతదేశంలో మణిపూర్ విలీనాన్ని వేర్వేరు మిలిటెంట్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1949 అక్టోబరు 15న జరిగిన విలీనాన్ని నిరసిస్తూ ఆదివారం ఈ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించాయి. దీంతో సాధారణ జనజీవనం ప్రభావితమైంది.
వ్యాపార సంస్థలు, మార్కెట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రైవేటు వాహనాలు మినహా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఐదు నిషిద్ధ మిలిటెంట్ సంస్థలు కలిసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. భారత్లో విలీనానికి నాడు మణిపూర్ మహారాజు బుద్ధచంద్ర సంతకం చేయడమే రాష్ట్రంలో అశాంతికి కారణమని మిలిటెంట్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి.