పిత్తోర్‌ఘర్: కైలాస మానస సరోవరాన్ని(Mount Kailash) ఇక నుంచి నేరుగా ఇండియా నుంచి విజిట్ చేసుకునే ఏర్పాట్లను చేస్తున్నారు. పరమశివుడి నివాస ప్రాంతమైన కైలాస పర్వతాన్ని సెప్టెంబర్ నుంచి భారత భూభాగం నుంచే వీక్షించవచ్చు అని అధికారులు చెబుతున్నారు. కైలాస పర్వతానికి వెళ్లేందుకు భారత భూభాగం నుంచే రోడ్డు మార్గాన్ని వేస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) దీనికి సంబంధించిన పనులు వేగవంతం చేసింది. భారత-చైనా బోర్డర్ సమీపంలో ఉన్న లిపులేక్ పాస్ వరకు కేఎంవీన్ హట్స్ నుంచి రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోడ్డు పనులు సెప్టెంబర్ వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
బీఆర్వో డైమెండ్ ప్రాజెక్టకు చెందిన చీఫ్ ఇంజినీర్ విమల్ గోస్వామి దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు. నాబిదంగ్లో ఉన్న కేఎంవీఎన్ హట్స్ నుంచి లిపులేక్ పాస్ వరకు రోడ్డు కట్టింగ్ పనులు మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఆరున్నర కిలోమీటర్ల దూరం ఆ రోడ్డు కట్టింగ్ జరుగుతోందన్నారు. రోడ్డు కట్టింగ్ పూర్తి అయిన తర్వాత.. కైలాస్ వ్యూవ్ పాయింట్‌కు రోడ్డు మార్గం రెఢీ అవుతుందని ఆయన తెలిపారు. కైలాస్ వ్యూవ్ పాయింట్‌ను డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం హిరాక్ ప్రాజెక్ట్‌కు బాధ్యతల్ని అప్పగించింది.
కైలాస్ వ్యూవ్ పాయింట్ కోసం ఇప్పటికే చాలా వరకు రోడ్డు కట్టింగ్ పనులు జరిగాయని, ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే, ఈ సెప్టెంబర్ వరకు అన్ని పనులు పూర్తి అవుతాయని ఆయన తెలిపారు. అయితే లిపులేక్ పాస్ ద్వారా చేపట్టాల్సిన కైలాస మానస సరోవర యాత్రను కోవిడ్ మహమ్మారి వల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ యాత్రను ఇంకా పునర్ ప్రారంభించలేదు. ఆ రూట్లో యాత్రను నిలిపివేయడం వల్ల భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. దీనిలో భాగంగానే కైలాస్ వ్యూవ్ పాయిట్ రోడ్డును డెవలప్ చేస్తున్నారు.