కోల్కతా: క్యాన్సర్తో పోరాడే ‘ఫ్రెండ్లీ బ్యాక్టీరియా’ను ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రిసెర్చ్’-కోల్కతా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. చికిత్స పురోగతిని పర్యవేక్షించగల డిటెక్షన్ వ్యవస్థను కూడా వారు రూపొందిస్తున్నారు. ఈ ఆవిష్కరణలు క్యాన్సర్ చికిత్స, రోగనిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఐఐఎస్ఈఆర్-కోల్కతా పేర్కొన్నది.
వీరు చేపట్టిన ‘రీసెట్’ ప్రోగ్రాం క్యాన్సర్ చికిత్సలో ఒక పెద్ద అడ్డంకిని పరిష్కరించింది. ‘రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించే ప్రత్యేక టీ సెల్స్ వెనుక కొన్నిసార్లు క్యాన్సర్ కణాలు దాక్కుంటాయి. దీంతో రోగి తీసుకునే కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ పెద్దగా పనిచేయవు’ అని సంస్థ వివరించింది. ఫ్రెండ్లీ బ్యాక్టీరియా (ప్రొబయాటిక్స్)ను సృష్టించి, క్యాన్సర్ కణాలపై పోరాడే వ్యవస్థను తిరిగి ప్రేరేపితం చేసే కొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.