NEET-UG 2024 | నీట్ యూజీ 2024 అవకతవకలపై సీబీఐ.. ఈడీ దర్యాప్తు.. సుప్రీంకోర్టులో పిటిషన్..!
NEET-UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పది మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
NEET-UG 2024 |ఎంబీబీఎస్ సహా పలు వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గత నెల ఐదో తేదీన నిర్వహించిన ‘నీట్ యూజీ -2024’ పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అవకతవకలపై బీహార్ పోలీసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కోరారు. ‘నీట్ యూజీ -2024 పరీక్ష రద్దుతో తలెత్తే పరిణామాల గురించి మాకు పూర్తిగా తెలుసు. కానీ అంతకు మించిన ఆల్టర్నేటివ్ లేదు’ అని పిటిషనర్లు పేర్కొన్నారు.
‘నీట్ యూజీ -2024 పరీక్ష నిర్వహణ పలు అవకతవకలతో కూడుకున్నది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సకాలంలో ప్రశ్నాపత్రాలు అందించలేదు. మరికొన్ని చోట్ల తప్పుడు సెట్ ప్రశ్నపత్రాలు ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు’ అని పిటిషనర్లు తెలిపారు. నీట్ యూజీ 2024 రద్దుతోపాటు కోర్టు పర్యవేక్షణతో దర్యాప్తు చేయాలని దాఖలైన పిటిషన్ల మీద అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపేయబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ పలు నగరాల్లో విద్యార్థులు, విపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. గత నెల ఐదో తేదీన దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో సుమారు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ 2024 పరీక్షకు హాజరయ్యారు. వాస్తవంగా ఈ నెల 14న వెల్లడించాల్సిన నీట్ పరీక్షా ఫలితాలు ఈ నెల నాలుగో తేదీనే ప్రకటించారు.
అయితే ఎన్టీఏ చరిత్రలోనే 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు వందశాతం మార్కులు వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఆరుగురు విద్యార్థులకు వందశాతం మార్కులు వచ్చాయి. 67 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం వల్లే వందశాతం మార్కులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర యూజీ వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. ‘నీట్ యూజీ’ పరీక్ష నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Bajaj CNG Bike | వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ముహూర్తం ఎప్పుడంటే..?!
Infinix Note 40 5G | 108 మెగా పిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ.. ధరెంతో తెలుసా..?!
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

