Pixxel | న్యూఢిల్లీ, జూలై 8: మీ ఇంటి పెరటి శాటిలైట్ చిత్రాలు కావాలా? లేక మీరు కోరుకొన్న ఏదైనా ఇతర ప్రాంతా ల ఫొటోలు కావాలా? బెంగళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ‘పిక్సెల్స్’ దీన్ని సాధ్యం చేయనున్న ది. దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌ను త్వర లో అవిష్కరించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా భూకక్ష్య లో ఇప్పటికే తిరుగుతున్న పిక్సెల్స్ సంస్థ ఉపగ్రహాలు తీసిన భూమి చిత్రాల డాటా బేస్ నుంచి తమకు అవసరమైన వాటి ని యూజర్లు బ్రౌజ్ చేసుకోవచ్చు.
ఒకవేళ అందుబాటులో లేకుంటే, అర్డర్ కూడా పెట్టుకొనే అవకాశం కూడా ఉంటుంది. పిక్సెల్స్ స్పేస్ సీఈవో, సహ వ్యవస్థాపకులు అవైస్ అహ్మద్ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతరిక్ష సంబంధిత డాటాను కొద్దిపాటి రుసుంతో సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నమే తమ స్టార్టప్‌కు చెందిన భూ పరిశీలన స్టూడియో ‘అరోరా’ అని పేర్కొన్నారు.
అరోరా మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని, పిక్సెల్స్ శాటిలైట్లు తీసిన భూమికి చెందిన హైపర్‌స్పెక్ట్రల్ చిత్రాలు, డాటా విశ్లేషణ అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించినట్టుగానే ఈ సాఫ్ట్వేర్ వినియోగం కూడా సులభంగా ఉంటుందని తెలిపారు. భూమి చిత్రాలను తీసేందుకు ఉద్దేశించిన శాకుంతల, ఆనంద్ అనే రెండు ఉపగ్రహాలను పిక్సెల్స్ సంస్థ లాంచ్ చేసింది.