Blast | జమ్మూ కశ్మీర్లో సోమవారం పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోపోర్‌లోని షేర్ కాలనీలో జరిగింది. ఓ స్క్రాప్ డీలర్ ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలను దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో, మహమ్మద్ ఆజం, ఆదిల్ ముస్తాక్, అబ్దుల్ రషీద్ భట్‌గా స్థానిక అధికారులు గుర్తించారు.
సోపోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దివ్య డీ పేలుడు ఘటనను ధ్రువీకరించారు. ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియరాలేదని.. కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ప్రస్తుతం పేలుడుకు కారణాలు తెలియరాలేదని ఎస్పీ దివ్య తెలిపారు. పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించవడంతో ఏం జరుగుతుందోనంటూ ఆందోళనకు గురయ్యారు.