January 26th | గణతంత్ర దినోత్సవం వేళ భారత్లో అలజడులకు పాక్ కుట్ర..!
January 26th | భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో అలజడులు సృష్టించేందుకు లష్కరే ఉగ్రవాద సంస్థ పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోకి చొరబడి దాడికి పాల్పడాలని పతక రచన చేస్తున్నది.
January 26th | భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో అలజడులు సృష్టించేందుకు లష్కరే ఉగ్రవాద సంస్థ పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోకి చొరబడి దాడికి పాల్పడాలని పతక రచన చేస్తున్నది. లష్కరే సంస్థకు తోడు పాక్ మద్దతు ఉన్న నాలుగు ఉగ్ర సంస్థలు సైతం రిపబ్లిక్ డే రోజున సైతం విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 26న కశ్మీర్లో లోయలో దాడికి యత్నించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ మేరకు కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం నిఘా సంస్థలు సమాచారం అందించాయి. రిపబ్లిక్ డే రోజున జమ్మూ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలకు సమాచారం అందింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా జమ్మూ కాశ్మీర్లో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుని లోయలో ప్రస్తుతం ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసింది.
రెండురోజుల కిందట చొరబాటుకు యత్నం..
ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అందిన సమాచారం ప్రకారం.. లష్కరేకు చెందిన ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు సాంబా సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నది. పాక్ రేంజర్ల సహాయంతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రిపబ్లిక్ డే నేపథ్యంలో పాక్ కుట్రలు పన్నుతుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జనవరి 26న పాక్ తన ఉగ్రసంస్థలను మరోసారి యాక్టివ్ చేసింది. లోయలో వాతావరణాన్ని చెడగొట్టేందుకు లష్కరే తొయిబాతో పాటు మరో రెండు రెండు ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ సిద్ధం చేసినట్లుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి వర్గాలు తెలిపాయి. ఐబీకి అందించిన సమాచారం మేరకు ఈ ఉగ్రవాదులు రెండు రోజుల కిందట సైతం చొరబాటుకు యత్నించారు. ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఫలితంగా ఉగ్రవాదులు తిరిగి వెళ్లి పాక్ రేంజర్ల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా నలుగురు ఉగ్రవాదులు చొరబడేందుకు పాక్ మరోసారి కుట్ర పన్నిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
ప్రశాంత వాతావరణానికి భగ్న కలిగించడానికే..
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో చొరబాట్లను నిరోధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, ఉగ్రదాడులతో పాటు ఇతర సంస్థలతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు పాక్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. సమాచారం మేరకు పాక్ ప్రోద్బలంతో ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ జనవరి 26న బ్లాక్ డే జరిపేందుకు పోస్టర్లను సైతం విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్ నేషనల్ ఫ్రంట్ సైతం లోయలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసే పని ప్రారంభించిందని నిఘా వర్గాలు సమాచారం అందింది. ఉగ్రవాదులతో పాటు లోయలోని నాలుగు నిషేధిత సంస్థలను సైతం క్రియాశీలం చేసి.. ప్రశాంత వాతావరణం భగ్నం చేసే పనిని పాక్ అప్పగించిందని కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి కుట్ర జరిగినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనంగా బలగాలను మోహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

