Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
Madhyapradesh | మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో(Ujjain) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువును పీల్చి(Poisonous gas) నలుగురు మృతి చెందారు.
Madhyapradesh | మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో(Ujjain) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువును పీల్చి(Poisonous gas) నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దేవాస్ రోడ్డులోని శ్రీ గంగా హోటల్లో శనివారం రాత్రి భూగర్భ వ్యర్థాల గదిని శుభ్రం చేస్తుండగా విష వాయువులను పీల్చి నలుగురు హోటల్ కార్మికులు(Hotel workers) మరణించారు. వారిని రక్షించడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురై దవాఖానలో చేరారు. రాత్రి 10.30 గంటల సమయంలో హోటల్ మిఠాయిలు, పాల ఉత్పత్తుల విభాగాల నుంచి వచ్చే మిగిలిపోయిన ఆహారం, ఇతర వ్యర్థాలను సేకరించే గదిలో శుభ్రత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది లోపలికి వెళ్లగా విషవాయువు ప్రభావంతో కుప్పకూలిపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన ఇతరులు కూడా అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హాస్పిటల్‌కు తరలించారు. మృతులను ఉజ్జయినికి చెందిన కమలేశ్, నితిన్, వహీద్, రాజస్థాన్‌లోని ఝాలావర్కు చెందిన మనోజ్ మీనాగా గుర్తించారు. విద్యుత్ కట్టర్‌తో గదిలోని కొంత భాగాన్ని తొలగించి బాధితులను బయటకు తీశారు. పోలీసులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ నలుగురిని కాపాడలేకపోయారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

