Smriti Irani: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ
Smriti Irani: పార్టీపరంగా బీజేపీ మహిళలకు పెద్దపీట వేసింది. నితిన్ నబిన్ నేతృత్వంలోని బీజేపీ కొత్త టీమ్‌ను ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక వసుంధరా రాజే.. జాతీయ ఉపాధ్యక్షురాలయ్యారు. 13 మంది ఉపాధ్యక్షుల్లో.. ఆరు మంది మహిళలే ఉన్నారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త టీమ్‌ను ప్రకటించింది. అనేక మంది ముఖ్య నేతలకు.. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani).. పార్టీ కేంద్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ పేరును ప్రకటించారు. ఇక రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, బయజయంత్ జయ పాండా, రేఖా వర్మ, తారిక్ మన్సూరులు.. జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. వినోద్ తవడే, సునిల్ భన్సల్ మాత్రం జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్ యదావిధిగా కొనసాగనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనిల్ అంథోనీ కొనసాగుతారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ప్రస్తుతం ఆరు మంది మహిళలు ఉన్నారు.
కానీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో కేవలం స్మృతి ఇరానీ ఒక్కరు మాత్రమే ఏకైక మహిళా నేత. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తాజా నియామకాలపై ప్రకటన చేశారు. తక్షణమే ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీర్థ సింగ్ రావత్, డీ పురంధీశ్వరి, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్యా, ఎం నాగరాజ, మధుచంద్ర కార్ ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో స్మృతి ఇరానీతో పాటు వినోద్ తవడే, సునిల్ భన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, సతీశ్ పూనియా, గజేంద్ర పటేల్, హరీశ్ ద్వివేది, సంజయ్ భాటియా ఉన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత.. స్మృతి ఇరానీకి సంస్థాగతంగా తొలిసారి కీలక బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధి రోహన్ గుప్తాకు.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా హోదా ఇచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. బీజేపీ జాతీయ కోశాధికారి బాధ్యతలు దక్కించుకున్నారు. రాజేశ్ మంగల్‌కు జాతీయ సంయుక్త కోశాధికారి పదవి దక్కింది. పలు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ పరంగా బీజేపీ మార్పులు చేపట్టింది.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin द्वारा निम्नलिखित सदस्यों को भाजपा के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया जा रहा है। (1/2) pic.twitter.com/tcTJsJG0dc
— BJP (@BJP4India) August 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

