Sharad Yadav | కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
Sarad Yadav | కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గురువారం రాత్రి కన్నుమూశారు.
Sharad Yadav | మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్.. జనతాదళ్ యునైటెడ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేశారు. ఏడు సార్లు లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు.
అనారోగ్యంతో బాధ పడుతున్న శరద్ యాదవ్‌ను చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని ఫొర్టిస్ దవాఖానలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. శరద్ యాదవ్ మరణించిన సంగతి ఆయన కూతురు సుభాషిణి శరద్ యాదవ్ ధ్రువీకరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పప్పా నహీ రహే అని హిందీలో ట్వీట్ చేశారు.
సోషలిస్టు నేతగా శరద్ యాదవ్ ఇలా
1947 జూలై ఒకటో తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శరద్ యాదవ్ జన్మించారు. దేశంలోని ప్రముఖ సోషలిస్టు నేతల్లో శరద్ యాదవ్ ఒకరు. బీహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. 1989కి ముందు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ స్థాపించిన జనతాదళ్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ యాదవ్.. పశుగ్రాసం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం ఖాయం కావడంతో పార్టీని చీల్చి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించారు. దీంతో జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ యాదవ్ నియమితులయ్యారు.
2003లో జేడీయూ స్థాపన
తర్వాత జనతాదళ్ యునైటెడ్ పార్టీని 2003లో స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా జార్జి ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ తదితరులతో కలిసి పని చేశారు. కేంద్రంలో 1999-2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కార్‌లో పలు మంత్రి పదవుల్లో పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నితీశ్ కుమార్ సాయంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తిరిగి 2009లో మధేపురా నుంచి లోక్‌సభకు ఎన్నికైనా.. 2014 ఎన్నికల్లో జేడీయూ ఓటమి పాలైంది.
ఇలా నితీశ్‌కు దూరం
2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2017లో నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ.. బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు నితీశ్ కుమార్‌తో కలిసి ముందుకు సాగేందుకు శరద్ యాదవ్ నిరాకరించారు. దీంతో 2018లో సొంతంగా లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) ఏర్పాటు చేశారు. జనతా పరివార్‌ను కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గత మార్చిలో ఆర్జేడీలో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని విలీనం చేశారు. మూడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి లాలూతో జత కట్టారు.
पापा नहीं रहे 😭
— Subhashini Sharad Yadav (@SubhashiniSY) January 12, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

