దేవఘడ్: జార్ఖండ్‌లోని దేవఘడ్లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యానాథ్ ఆలయాన్ని ఇవాళ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవ గౌడ(HD Deve Gowda ) దర్శించుకున్నారు. ఆలయంలోని పూజారులు ఆయన చేత పూజలు నిర్వహించారు. వైదిక మంత్రాలను చదివించారు. సంకల్పం చేయించారు. గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగ స్వరూపుడైన బైద్యనాథుడికి .. దేవగౌడ జలాభిషేకం నిర్వహించారు.
आज माननीय पूर्व प्रधानमंत्री श्री हरदानहल्ली डोड्डेगौड़ा देवेगौड़ा (HD Deve Gowda) ने कामनालिंग बाबा बैद्यनाथ की पूजा-अर्चना कर पवित्र द्वादस ज्यातिर्लिंग का जलाभिषेक किया। इस दौरान माननीय पूर्व प्रधानमंत्री को स्मृति चिन्ह व अंग वस्त्र प्रदान किया।@H_D_Devegowda @JharkhandCMO pic.twitter.com/5cJfwpI2d1
— DC Deoghar (@DCDeoghar) January 6, 2025
ఆయన నుదిటిపై భస్మాన్ని ధరించి, మంగళ దీవెనులు ఇచ్చారు. మాజీ ప్రధాని దేవగౌడ రాక సందర్భంగా జిల్లా ఎస్పీ విశాల్ సాగర్ భద్రతా ఏర్పాట్లు చేశారు. మాజీ ప్రధాని ఇవాళ ఉదయం దేవఘర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బైద్యనాథుడి రూపంలో దర్శనం ఇస్తున్న శివలింగానికి అభిషేకం చేసిన వీడియోను దౌవగౌడ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
12 ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಜಾರ್ಖಂಡ್ ರಾಜ್ಯದ ದಿಯೋಘರ್ನಲ್ಲಿರುವ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವಾದ ಶ್ರೀ ವೈದ್ಯನಾಥೇಶ್ವರ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗದ ದಿವ್ಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದು, ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ಧನ್ಯನಾದೆನು.
Visited the sacred Vaidyanath Jyotirlinga in Jharkhand, one of the 12 divine Jyotirlingas of Lord Shiva. pic.twitter.com/107PoXvBIC
— H D Devegowda (@H_D_Devegowda) January 6, 2025