Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Pyare Miyan: బాలికలను రేప్ చేసిన కేసులో భోపాల్‌లోని మాజీ న్యూస్‌పేపర్ ఓనర్ ప్యారే మియాకు కోర్టు శిక్ష విధించింది. 10 జీవితకాల శిక్షలను విధిస్తూ పోక్సో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ న్యూస్‌పేపర్ ఓనర్, 70 ఏళ్ల ప్యారే మియా(Pyare Miyan)కు స్థానిక పోక్సో కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయిదుగురు మైనర్ అమ్మాయిలను రేప్ చేసిన కేసులో అతనికి వేర్వేరుగా 10 జీవితకాల శిక్షలను విధించింది. అతనికి 77.64 లక్షల జరిమానా కూడా విధించింది. మంగళవారం ఈ కేసులో తీర్పును వెలువరించారు. పోక్సో, ఐపీసీ చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. మరణించే వరకు ఎనిమిది శిక్షలు, రెండు సార్లు జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. అన్ని శిక్షలను ఒకేసారి అమలు చేయనున్నారు.
నిందితుడు ప్యారే మియాకు సహకరించిన రాబియా బీకి 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 78 ఏళ్ల ప్యారే మియా.. 2014 నుంచి బాలికలను టార్గెట్ చేస్తున్నారు. నెలకు 10వేల జీతం ఇస్తానని అమ్మాయిలను రిక్రూట్ చేసుకుని, ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించేవాడని, అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొన్నది. రాబియా బీ అతనికి అన్ని అంశాల్లో సహకరించింది. 2020 జూలై 11వ తేదీన ఈ నేరాల గురించి బయటకు తెలిసింది.
కౌన్సిలింగ్ సెషన్లో ప్యారే మియా చేష్టల గురించి ఓ బాధితురాలు చెప్పింది. బర్త్‌డే పార్టీకి పిలిచి మద్యం తాగించారని, ఆ తర్వాత తనపై ప్యారే మియా లైంగిక దాడి చేసినట్లు ఆమె పేర్కొన్నది. అనేక మంది మైనర్ అమ్మాయిలు ఇదే తరహా ఆరోపణ చేశారు. ప్యారేమియాపై ఆరోపణలు రుజువు కావడంతో అతనికి 10 జీవితకాల జైలుశిక్షలు విధించినట్లు ప్రాసిక్యూటన్ పీఎన్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాజీ న్యూస్‌పేపర్ ఓనర్‌ను అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pyare Miyan: మైనర్ అమ్మాయిల రేప్.. నిందితుడికి 10 జీవితకాల శిక్షలు
Red alert | అర్నాబ్ తుఫాన్ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Don’t Trouble the Trouble | ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..!
Cyclone Arnab | తీరం దాటుతున్న ‘అర్నబ్’.. మరో రెండు గంటలు కీలకం!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

