India – China | ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు చైనా మద్దతు.. వాణిజ్యంపైనా చర్చలు..!
India - China : షాంఘై కో-ఆపరేషన్ సమావేశం(SCO)లో భారత ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యం ఫలిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు తెలిపింది. అన్నివిధాలుగా తాము సహకరిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి మాటిచ్చారు.
India – China : షాంఘై కో-ఆపరేషన్ సమావేశం(SCO)లో భారత ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యం ఫలిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు తెలిపింది. అన్నివిధాలుగా తాము సహకరిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి మాటిచ్చారు. ఈ విషయాన్ని ఆదివారం భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతేకాదు రష్యా నుంచి ముడి చమురు కొనడంపై అమెరికా సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని మోడీ, జిన్‌పింగ్ భావించారు. సరిహద్దులో శాంతియుత వాతావరణం ఏర్పడే దిశగా కృషి చేసేందుకు ఇరువురు అంగీకరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ లేవనెత్తిన ఉగ్రవాదం అంశంపై చర్చ జరిగింది. సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందకు మనదేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని చాలా క్లుప్తంగా, స్పష్టంగా జిన్‌పింగ్‌కు వివరించారు. టెర్రిరిజం బాధిత దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి అని పేర్కొన్న మోడీ చైనా అధ్యక్షుడి మద్దతు కోరారు. అందుకు ఆయన అంగీకరించారు అని మీడియాకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) తెలిపారు.
Had a fruitful meeting with President Xi Jinping in Tianjin on the sidelines of the SCO Summit. We reviewed the positive momentum in India-China relations since our last meeting in Kazan. We agreed on the importance of maintaining peace and tranquility in border areas and… pic.twitter.com/HBYS5lhe9d
— Narendra Modi (@narendramodi) August 31, 2025
ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలను పటిష్టం చేయడంపై దృష్టిసారించిన మోడీ ఆ దేశ అధ్యక్షుడి జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీఓ సమావేశం మధ్యలో ఇరువురు తమ బృందాలతో కలిసి పలు విషయాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం సంబంధాల బలోపేతం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

