అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించింది. రాష్ట్ర రాజధాని అవసరాన్ని తాము గుర్తించామని, ఇందుకోసం బహుముఖ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
- బడ్జెట్లో ఏపీకి పెద్దపీట
- పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకారం
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు
- ‘పూర్వోదయ’ ప్రాజెక్టులో ఆంధ్రకు చోటు
- పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు
అమరావతి, జూలై 23: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించింది. రాష్ట్ర రాజధాని అవసరాన్ని తాము గుర్తించామని, ఇందుకోసం బహుముఖ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి రూ.15,000 కోట్లు, రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధికి నిధులు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి బడ్జెట్లో కేంద్రం ప్రాధాన్యతనిచ్చింది. హైదరాబాద్ – బెంగళూరు, విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని బడ్జెట్లో పొందుపరిచింది. కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి అవసరమైన నీటి వసతులు, విద్యుత్తు, రైల్వే, రోడ్ల నిర్మాణానికు నిధులు మంజూరు చేస్తామని నిర్మలా సీతారమన్ ప్రకటించారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తామని చెప్పారు. తూర్పు రాష్ర్టాల అభివృద్ధి కోసం కేంద్రం కొత్తగా ప్రారంభించిన పూర్వోదయ ప్రాజెక్టులోనూ ఆంధ్రప్రదేశ్‌ను భాగం చేసింది.
కేంద్రానికి కృతజ్ఞతలు: చంద్రబాబు నాయుడు
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కేటాయింపు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అవసరాలు గుర్తించి, రాజధాని, పోలవరం, పారిశ్రామిక, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ ప్రజల పక్షాన కృతజ్ఞతలు’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక బడ్జెట్ కేటాయింపులపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇది ఏపీకి సరికొత్త సూర్యోదయమని, ఏపీ చరిత్రలో ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

