న్యూఢిల్లీ : మానవుని మెదడు అభివృద్ధిలో ఐదు ప్రధాన దశలు ఉంటాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఒకటో దశ (0-9 ఏళ్లు)ను బాల్యం తొలినాళ్లుగా వర్గీకరించారు. ఈ దశలో బ్రెయిన్ రీవైరింగ్/అవసరం లేని నాడీ సంబంధాల తొలగింపు జరుగుతుంది. నిర్మాణపరమైన మార్పులు వేగంగా జరుగుతాయి. రెండో దశ (9-32 ఏళ్లు)లో కౌమారదశ ఉంటుంది. మెదడు నెట్వర్క్లు పరిపక్వమవుతాయి.
మరింత వ్యవస్థీకృతమవుతాయి, కౌమారాన్ని 32 సంవత్సరాల వయసు వరకు పొడిగిస్తాయి. మూడో దశ (32-66 ఏళ్లు)లో, యుక్తవయసుకు సంబంధించిన స్థిరత్వం మెదడులో వస్తుంది. నాలుగో దశ (66-83 ఏళ్లు)లో మెదడు వృద్ధాప్యం ప్రారంభంలోకి మారుతుంది. ఐదో దశ (83 ఏళ్ల నుంచి)లో వృద్ధాప్యం మలి దశ ఉంటుంది. అత్యధిక కనెక్షన్లు బలహీనపడతాయి,