Modi Cabinet | తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు..!
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఎన్నికైన బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు దక్కింది.
నరేంద్రమోదీ 2.0 క్యాబినెట్లో చోటు దక్కించుకున్న జీ కిషన్ రెడ్డి మినహా అందరూ తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి కరీంనగర్ స్థానం నుంచి గెలుపొందిన బండి సంజయ్ కుమార్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకే ప్రధాని మోదీ అవకాశం కల్పించారు.
2019 ఎన్నికల్లో గెలుపొందగానే తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయనను తప్పించి, కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం లోక్ సభా స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. టీడీపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అచ్చెన్నాయుడు కుమారుడే రామ్మోహన్ నాయుడు.
గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌కూ సహాయ మంత్రి పదవి లభించింది. పెమ్మరాజు చంద్రశేఖర్ తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.
ఇక బీజేపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకూ సహాయ మంత్రి హోదా లభించింది. భూపతి రాజు శ్రీనివాసవర్మ కూడా పార్లమెంటుకు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

