One Nation One Election | 23న ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కమిటీ తొలి సమావేశం
One Nation One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (One Nation One Election) విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు.
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (One Nation One Election) విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. దీని కోసం రాజ్యాంగంలో చేయాల్సిన సవరణలు, సంబంధిత చట్టాల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.
కాగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల విధానాన్ని పరిశీలించేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

