Agniveers | అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి.. వారిలో 272 మంది మహిళలు
అగ్నివీర్స్ (Agniveers) మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని (Odisha) ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka)లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
భువనేశ్వర్: అగ్నివీర్స్ (Agniveers) మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని (Odisha) ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka)లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్‌లో మొత్తం 2,585 అగ్నివీర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో 272 మంది మహిళా అగ్నివీరులు ఉండడం విశేషం. సాధారణంగా పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఉదయం వేళల్లో నిర్వహిస్తారు. అయితే భారత సాయుధ దళాల చరిత్రలో మొదటిసారిగా రాత్రి పూట పాసింగ్ అవుట్ పరేడ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ (Admiral R Hari Kumar).. అగ్నివీరుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు వద్ద శిక్షణ పొందిన ఈ అగ్నివీర్లను సముద్ర శిక్షణ కోసం ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకల్లో మోహరిస్తామని అధికారులు తెలిపారు. భారత నౌకాదళంలో తొలిసారిగా మహిళలు నావికులుగా నియమితులయ్యారని చెప్పారు. కాగా, అగ్నివీర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022, జూన్ 14న ప్రారంభించింది. తొలిసారిగా ఇండియన్ నేవీ అగ్నివీరులను రిక్రూట్ చేసుకున్నది. గతేడాది డిసెంబర్ 7న ఐఎన్ఎస్ చిల్కా వద్ద మొదటి బ్యాచ్‌కు శిక్షణను ప్రారంభించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

