న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సమల్కా కపషేరా (Samalkha Kapashera) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్‌లో (Sonia Gandhi camp) ఉన్న కలప గోదామ్‌లో (Lumber store Godown) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటుకున్నాయి. క్రమంగా గోదామ్ మొత్తం మంటలు వ్యాపించాయి. గోదామ్‌లో కలప పెద్దసంఖ్యలో ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఢిల్లీ అగ్నిమాపకశాఖ డివిజనల్ ఆఫీసర్ సత్పాల్ భరద్వాజ్ అన్నారు. మంటలను వీలైనంత త్వరగా అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటిక వరకు ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Fire breaks out at a godown in Sonia Gandhi camp in Samalkha Kapashera area. 14 fire tenders have reached the spot, no casualties reported so far. pic.twitter.com/iMzbgoWxAG
— ANI (@ANI) April 6, 2023