భోపాల్: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహంకాళీ ఆలయ ఆవరణలో సోమవారం మంటలు చెలరేగాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ కంట్రోల్ రూమ్‌పై ఏర్పాటు చేసిన గాలి నాణ్యత నిర్వహణ వ్యవస్థలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయని, ఓ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్‌కు గురవ్వటం వల్లే ఇది జరిగి ఉండొచ్చని జిల్లా అధికారులు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారని, ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.