న్యూఢిల్లీ, జూలై 14 : కేంద్రం అమలు చేస్తున్న ఇథనాల్ ఇంధన పాలసీపై రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించినందుకు నలుగురు సామాజిక మాధ్యమ ఇన్ఫ్ల్యూయెన్సర్లపై నాగ్పూర్ సర్దార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ సామాజిక మాధ్యమ ఆఫీస్ బేరర్ అరుణ్ భివపురే ఫిర్యాదు మేరకు ఇథనాల్ పాలసీపై వీరు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.
ఇథనాల్ పాలసీపై ఈ నెల 3న గడ్కరీ చేసిన ప్రసంగాన్ని వీరు ముక్కలు ముక్కలుగా ప్రసారం చేసి వాస్తవాలను వక్రీకరిస్తూ వాటిని ప్రసారం చేశారని ఆరోపణ. యూట్యూబర్ మనీశ్ కాశ్యప్, సామాజిక మాధ్యమ ఇన్ఫ్లూయెన్సర్లు హర్షిత్ రాఠీ, అంక్లేష్ ఇన్వాటే, ఇన్స్టా పేజీ దేశీ బాయ్స్ఎన్సీఆర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రశ్నించినందుకే ఇలా కేసులు నమోదు చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.