Kuno National Park | కునో పార్కులో ఐదు నెలల్లో 9 చీతాలు మృతి.. ఇంతకీ వరుస మరణాల వెనుక ఉన్న కారణమేంటి?
Kuno National Park | ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో వాటి మానాన అవి బతుకుతున్న 20 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో పడేసిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాత వాటి బాగోగులను పట్టించుకోవట్లేదు. చిరుతలను తీసుకొచ్చినప్పుడు ఫొటోలు దిగుతూ పబ్లిసిటీ చేయించుకొన్న ప్రధాని మోదీ.. అవి చనిపోతున్నప్పుడు నోరుమెదపట్లేదు.
Kuno National Park | స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ; ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో వాటి మానాన అవి బతుకుతున్న 20 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో పడేసిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాత వాటి బాగోగులను పట్టించుకోవట్లేదు. చిరుతలను తీసుకొచ్చినప్పుడు ఫొటోలు దిగుతూ పబ్లిసిటీ చేయించుకొన్న ప్రధాని మోదీ.. అవి చనిపోతున్నప్పుడు నోరుమెదపట్లేదు. కునోలోని చీతాల్లో తాజాగా మరొకటి మరణించింది. ఆడ చీతా ‘ధాత్రీ’ చనిపోయిందని కునో పార్కు అధికారులు మంగళవారం తెలిపారు. మరణానికి గల కారణాలను తెలుసుకొంటున్నట్టు పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే 9 చీతాలు మరణించడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు సూచించినా..
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా ఆఫ్రికా నుంచి 20 చీతాలను కునోకు తరలించిన కేంద్రం.. ఏడాదిపాటు పార్కులోనే వాటిని ఉంచాలని నిర్ణయించింది. ఆ తర్వాత చీతాలను అడవుల్లోకి విడిచిపెట్టాలని ప్రణాళికలు సిద్ధంచేసింది. అయితే, చీతాల వరుస మరణాలపై జంతుప్రేమికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీతాలను కునో నుంచి వేరే ప్రాంతానికి తరలించకపోతే ఏడాది గడిచేనాటికి మొత్తం చీతాలు అంతరించిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. చీతాల ఆవాసానికి కునో పార్కు అనువుగా లేదని, వెంటనే వాటిని వేరేచోటుకి తరలించాలని సూచిస్తున్నారు. చీతాల అంశంపై సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి దాదాపు ఇవే సూచనలు చేసింది. ప్రతిష్టకు సంబంధించి ఆలోచించాల్సిన సమయం ఇది కాదని, చీతాలను వేరే చోటుకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టాలంటూ కోర్టు సూచించింది. అయినప్పటికీ, కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదు.
1952లో చివరిసారిగా..
దేశంలో 1952లో చివరగా చీతా కనిపించింది. దీంతో అంతరించిపోయిన జాతిగా కేంద్రం ప్రకటించింది.
ప్రాజెక్ట్ చీతా
దేశంలో చీతాల సంఖ్యను వృద్ధిచేయడానికి ‘ప్రాజెక్ట్ చీతా’ పేరిట నమీబియా నుంచి 8 చీతాలను, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను రెండు దఫాల్లో కేంద్రం భారత్‌కు తీసుకొచ్చింది.
బందిఖానాలో పెట్టినట్టు..
ఒక్కో ఆఫ్రికా చీతా సంచరించడానికి కనీసం 100 చదరపు కిలోమీటర్ల పరిధి అవసరం. కునో పార్కులో పెట్టిన 20 చీతాలకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధి కావాలి. అయితే, 20 చీతాలకు కేటాయించింది 487 చదరపు కిలోమీటర్లే.

Cheeta
చీతాల మరణానికి నిపుణులు చెప్తున్న కారణాలు
సౌకర్యంగాలేని జీవావరణ ప్రదేశం, సంచరించడానికి తగిన జాగా పార్కులో లేకపోవడం.
నిఘా కోసం చీతాల మెడకు రేడియో కాలర్లు అమర్చడంతో ఇన్ఫెక్షన్లు.
సంతానం కోసం చీతాలను బలవంతంగా దగ్గరకు చేర్చడంతో అంతర్గత అవయవాలకు గాయాలు.
వాతావరణంలో మార్పు, గతంలో ఆఫ్రికా చీతాలను సంరక్షించిన అనుభవం నిర్వాహకులకు లేకపోవడం.
ఎప్పుడు ఏం జరిగింది?
సెప్టెంబర్ 17, 2022:
నమీబియా నుంచి కునో పార్కుకు 8 చీతాలు
ఫిబ్రవరి 18, 2023:
దక్షిణాఫ్రికా నుంచి కునో పార్కుకు మరో 12 చీతాలు
ఫిబ్రవరి 19:
కునో పార్కులో 20కు చేరిన మొత్తం చీతాల సంఖ్య
మార్చి 27:
మూత్రపిండాల సమస్యతో చీతా ‘సాషా’ మృతి
ఏప్రిల్ 13:
గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చీతా ‘ఉదయ్’ మృతి
మే 9:
సంభోగం చేస్తూ గాయాలపాలై మరణించిన ఆడ చీతా ‘దక్ష’
మే 25:
అనారోగ్యంతో చీతా ‘జ్వాలా’ మూడు పిల్లలు మృతి
జూలై 11:
రేడియో కాలర్ గాయాల కారణంగా ఇన్ఫెక్షన్తో చీతా ‘తేజస్’ మృతి
జూలై 14:
రేడియో కాలర్ గాయాల కారణంగా మరో చీతా ‘సూరజ్’ మరణం
ఆగస్టు 2:
ఆడ చీతా ‘ధాత్రీ’ మృతి. కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

