పంటను తగలబెడుతున్నా.. చూద్దురు రండి
అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాల్చేయాలని మహారాష్ట్రకు చెందిన ఓ రైతు నిర్ణయించారు.
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి,డిప్యూటీ సీఎంకు రైతు ఆహ్వానం
- ప్రభుత్వ తీరుపై నిరసన
ముంబయి, డిసెంబర్ 24: అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాల్చేయాలని మహారాష్ట్రకు చెందిన ఓ రైతు నిర్ణయించారు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆహ్వానం పంపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆనంద్గావ్కు చెందిన గంగాభీషణ్ థవారే ఈ నిర్ణయానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ చెరుకు ఫ్యాక్టరీ ఇంతకుముందు 15 మంది రైతుల వద్ద నుంచి పంట కొని డబ్బులు బకాయి పడింది. ఈ డబ్బులను 15 శాతం వడ్డీతో సహా రైతులకు చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో సదరు ఫ్యాక్టరీ ఈ రైతులపై కక్షతో వీరి పంట కొనడం లేదు. మరో గత్యంతరం లేక రైతులు పంటను దూరాన ఉన్న మరో ఫ్యాక్టరీకి తరలించి అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కో ఎకరంపైన వారికి రూ.20 వేల వరకు భారం పడుతున్నది. దీంతో 26న పంటను కాల్చేస్తు న్నానని, దీనికి హాజరుకావాలని సీఎం, డిప్యూటీ సీఎంను రైతు ఆహ్వానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

