Rail Roko | అన్నదాత ఆగ్రహం : సమస్యల పరిష్కారం కోరుతూ పంజాబ్‌లో రైల్‌రోకో
రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి మెరుగైన పరిహారంతో పాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్‌లో రైతులు పోరుబాట (Rail Roko) పట్టారు.
చండీఘఢ్ : రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి మెరుగైన పరిహారంతో పాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్‌లో రైతులు పోరుబాట (Rail Roko) పట్టారు. గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్సీ) ఆధ్వర్యంలో రైతులు రైల్ రోకో చేపట్టారు.
రైల్వే స్టేషన్లో టెంట్లు ఏర్పాటు చేసిన రైతులు రైలు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సరైన పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కేఎంఎస్సీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్నదని, బాధిత రైతులందరికీ ఎకరాకు రూ. 50,000 పరిహారం చెల్లించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గోధుమల సేకరణ కోసం నిబంధనలను సడలించాలని కోరారు.
వ్యవసాయ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలని, రైతులకు ఊరట ఇచ్చేలా ఆరు నెలల పాటు వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వాటిల్లిన పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే అంచనాలు రూపొందించి వీలైనంత త్వరలో రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read More
Rahul Gandhi | జైలు శిక్షను అప్పీల్ చేయనున్న రాహుల్ గాంధీ.. రేపు సూరత్ కోర్టుకు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Farmers group
- Punjab
- rail roko
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

