లక్నో: ఒక రైతు ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. అందరూ చూస్తుండగా నిప్పు అంటించుకున్నాడు. (Farmer Sets On Fire) మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆ రైతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలీపూర్ మొరానా గ్రామ సమీపంలో అటవీశాఖకు చెందిన సుమారు మూడు హెక్టార్ల భూమిని గ్రామస్తులు కొన్నేళ్లుగా ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారు. అయితే అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ట్రాక్టర్ ద్వారా ఆక్రమణలను ధ్వంసం చేశారు.
కాగా, అలీపూర్ మొరానాకు చెందిన 55 ఏళ్ల రైతు జగ్బీర్ దీనిపై అభ్యంతరం తెలిపాడు. ఆ భూమిపై హక్కులు ఉన్నాయని చెప్పాడు. స్థానిక తహసీల్ కార్యాలయానికి చేరుకుని దీనిపై నిరసన వ్యక్తం చేశాడు. ఆపై అంతా చూస్తుండగా శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు అక్కడున్న వారు వెంటనే స్పందించారు. మంటలు ఆర్పి ఆ రైతును కాపాడారు. తొలుత స్థానిక ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ రైతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मेरठ SDM कार्यालय के बाहर किसान ने किया आत्मदाह
मवाना तहसील में शुक्रवार दोपहर एसडीएम दफ्तर के बाहर अलीपुर मोरना निवासी किसान जगदीप ने अपने ऊपर पेट्रोल डालकर आग लगा ली वहां मौजूद लोगों ने किसी तरह उसके ऊपर कपड़े आदि डालकर आग बुझाई वह काफी जल गया pic.twitter.com/MriRohfZoM— Lavely Bakshi (@lavelybakshi) January 5, 2024