Fake Ghee: కల్తీ నెయ్యి ఫ్యాక్టరీ గుట్టు రట్టు.. పాపులర్ బ్రాండ్ల లేబుల్స్ సీజ్
Fake ghee: కల్తీ నెయ్యి అమ్ముతున్న ఫ్యాక్టరీ గుట్టును రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తేలింది. ఆ ఫ్యాక్టరీపై అటాక్ చేసిన పోలీసులు కొన్ని కంటేనర్లను సీజ్ చేశారు. పతంజలి, మదర్ డెయిర్, అముల్ లాంటి బ్రాండ్లకు చెందిన లేబుల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: కల్తీ నెయ్యి(Fake Ghee) అమ్ముతున్న ఫ్యాక్టరీ గుట్టును రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. నగరంలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో కల్తీ నెయ్యి అమ్ముతున్నట్లు తేలింది. ఆ ఫ్యాక్టరీపై అటాక్ చేసిన పోలీసులు కొన్ని కంటేనర్లను సీజ్ చేశారు. పతంజలి, మదర్ డెయిర్, అముల్ లాంటి బ్రాండ్లకు చెందిన లేబుల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 19వ తేదీన ఆ ఫ్యాక్టరీపై విజిలెన్స్ పోలీసులు తనిఖీలు నిర్వమించారు. కల్తీ నెయ్యి చేసేందుకు అవసరమైన అన్ని వస్తువుల్ని గుర్తించినట్లు డీసీపీ హర్ష వర్ధన్ తెలిపారు. నెయ్యి ఫ్యాక్టరీ నడిపేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా వాళ్లు చూపించలేదని పోలీసులు వెల్లడించారు. సుమిత్ అనే వ్యక్తి పేరుపై ఆ కంపెనీ ఉంది. కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం అతనిపై కేసు బుక్ చేశారు. వివిధ కంపెనీలకు చెందిన సుమారు అయిదువేల వ్రాపర్లను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మదర్ డెయిరీ పేరుతో ఉన్న 120 నెయ్యి కార్టూన్లను సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

