ఆదివారం 29 మార్చి 2020
National - Feb 26, 2020 , 18:39:05

ఈశాన్య ఢిల్లీలో రేపు జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు వాయిదా..

ఈశాన్య ఢిల్లీలో రేపు జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు వాయిదా..

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేక.. అనుకూలవాదుల మధ్య చెలరేగుతున్న అల్లర్ల కారణంగా రేపు జరగాల్సిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను సీబీఎస్‌సీ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) వాయిదా వేసింది. దీనికి సంబంధించిన ప్రెస్‌నోట్‌ను సీబీఎస్‌సీ విడుదల చేసింది. పరీక్షలు నిర్వహించే తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎస్‌సీ కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టాఫ్‌ విజ్ఞప్తి మేరకు రేపటి పరీక్షలు(27-02-2020) వాయిదా వేస్తున్నట్లు బోర్డు వివరణ ఇచ్చింది. ఈశాన్య ఢిల్లీ కాకుండా మిగితా ప్రాంతాల్లో పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని సీబీఎస్‌ఈ ప్రెస్‌నోట్‌లో తెలిపింది. 


logo