నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తృణమూల్ మాజీ మంత్రి అరెస్టు..
మాజీ మంత్రి అరెస్టు | పశ్చిమబంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అరెస్టయ్యారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా పని చేసినప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదివారం ఆయనను అరెస్టు చేసినట్లు బంకురా పోలీస్టేషన్ అధికారి ధృతిమాన్ సర్కార్ తెలిపారు.

బిష్ణుపూర్ : పశ్చిమబంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అరెస్టయ్యారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా పని చేసినప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదివారం ఆయనను అరెస్టు చేసినట్లు బంకురా పోలీస్టేషన్ అధికారి ధృతిమాన్ సర్కార్ తెలిపారు. శ్యామప్రసాద్ ముఖర్జీని బిష్ణుపూర్ కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ ఆయనకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో ముఖర్జీ నిధులు పక్కదారి పట్టించారని బిష్ణుపూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ) ఇటీవల బంకురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ సుదీర్ఘకాలంపాటు తృణమూల్ కాంగ్రెస్లో కొనసాగారు. గత మమత ప్రభుత్వంలో ఆయన టెక్స్టైల్ మంత్రిగా సేవలందించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్యామప్రసాద్ అరెస్టవడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నది. మమత కక్షసాధింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

