న్యూఢిల్లీ: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఓ కస్టడీ డెత్ కేసులో అతను జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును ఇచ్చింది. బెయిల్ ఇవ్వకున్నా.. ప్రాధాన్యత ఆధారంగా అభ్యర్తనపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. సంజీవ్ భట్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఆసక్తిగా లేమని, బెయిల్ అప్పీల్‌ను తిరస్కరిస్తున్నామని, అయితే కేసులో విచారణ కొనసాగుతుందని బెంచ్ తెలిపింది.
1990లో జామ్‌నగర్ జిల్లాకు అదనపు ఎస్పీగా ఉన్న సమయంలో కస్టడీ డెత్ ఘటన జరిగింది. టాడా చట్టం కంద 133 మందిని అప్పట్లో అరెస్టు చేశారు. రథయాత్ర చేస్తున్న అద్వానీని అరెస్టు చేయడంతో.. బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు అక్టోబర్ 30వ తేదీన బంద్‌కు పిలుపుఇచ్చారు. అయితే అరెస్టు అయిన వ్యక్తుల్లో ప్రభుదాస్ వైష్ణాని కస్టడీ నుంచి రిలీజైన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. కస్టడీలో ఉన్న సమయంలో భట్ పెట్టిన టార్చర్ వల్లే ప్రభుదాస్ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో భట్‌పై కేసు నమోదు చేశారు. ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లపై ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
జామ్‌నగర్‌లోని సెషన్స్ కోర్టు భట్‌తో పాటు ఇతర పోలీసులకు జీవిత ఖైదు శిక్ష వేసింది. జనవరి 2024లో భట్ అప్పీల్‌ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతను సుప్రీంను ఆవ్రయించాడు. భట్‌పై మరో రెండు కేసులు కూడా ఉన్నాయి. 1996 డ్రగ్స్ కేసుతో పాటు 1997 కస్టడీ డెత్ కేసులున్నాయి.